మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో పెళ్లైన 18 రోజులకే బీటెక్ విద్యార్థిని పల్లవి (20) మృతి చెందింది. ఆగస్టు 30న చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌రెడ్డితో ఆమెకు వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త శారీరకంగా, మానసికంగా వేధించాడని పల్లవి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సెప్టెంబర్ 18న ఘనపూర్‌లోని కేపీఆర్‌ఐటీ కాలేజీ భవనం పైనుంచి దూకి ఆమె సూసైడ్ చేసుకుంది. తల్లి సంధ్య ఫిర్యాదుతో ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.