ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. 2023లో బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2024లో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే సికింద్రాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీనిపై బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు స్పీకర్‌ను ఆశ్రయించగా.. స్పీకర్ అనర్హత పిటిషన్‌ను తిరస్కరించారు. దాన్ని సవాల్ చేస్తే బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. తాజాగా తన అనర్హత తీర్పుపై దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన తనకు లేదని అన్నారు. తానో ఫైటర్‌నని ఫైట్ చేద్దామని సీఎం రేవంత్ తెలిపినట్లు వెల్లడించారు.