AP Panchayat Raj Department Officals Clarification On Go 888: ఏపీ పంచాయతీరాజ్ శాఖ రెండు రూపాయలు విడుదల చేయాలని జారీ చేసిన జీవో వైరల్ అయ్యింది. కేవలం రెండు రూపాయల కోసం జీవో ఎందుకనే చర్చ జరిగిది. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పనులకు సంబంధించిన ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపులో సాంకేతిక సమస్య ఎదురైందని.. ఆ సమస్యను పరిష్కరించడానికి నిపుణుల సూచన మేరకు ఇలా రెండు రూపాయల జీవో విడుదల చేశారని అధికారులు స్పష్టత ఇచ్చారు.