జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మీద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సమయం దాటిన తర్వాత కూడా డీజే పెట్టుకుని వేడుకలు నిర్వహించగా.. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. కేవలం డీజే పెట్టటమే కాకుండా.. పోలీసులు వచ్చినా ఏం చేయలేరు అంటూ తల్వార్ పట్టుకుని సంచలన వ్యాఖ్యలు చేయటంపై నెట్టింట తీవ్ర విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే.