విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 28వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా.. గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ సీఈవో కూడా పాల్గొంటారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్, అదానీ ఇన్‌ఫ్రా కలిసి ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాయి. జూలై 2028 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.