వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను గుంటూరు కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే దర్యాప్తులో భాగంగా గోరంట్ల మాధవ్‌ను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించాలని నగరంపాలెం పోలీసులు గుంటూరు మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు.. పోలీసుల వాదనలతో ఏకీభవించింది. అయితే ఐదురోజులకు బదులుగా రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.