గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 23 ఎపిసోడ్‌లో తనకు జాబ్ వచ్చిన సందర్భంగా ఇంటికి స్వీట్ తీసుకొని వస్తాడు మనోజ్. మొదటిరోజు జీతంతో ఈ స్వీట్స్ తెచ్చానని నోరు జారుతాడు. నువ్వు ఏ జాబ్ చేస్తున్నావని బాలు ఆరాలు తీస్తాడు. నా చదువుకు తగ్గ ఉద్యోగం అని మనోజ్ అబద్ధం ఆడుతాడు.