పసిగుడ్డు అని కూడా చూడకుండా దారుణానికి ఒడిగట్టింది సవతి తల్లి. మొదటి భార్య పిల్లలు అనే కోపంతో చిత్రహింసలకు గురిచేసింది. అతి కర్కశంగా ఆరేళ్ల బాబును గోడకేసి కొట్టి చంపింది. ఈ అమానవీయ ఘటన గుంటూరులోని ఫిరంగిపురం గ్రామంలో చోటుచేసుకుంది. సాగర్ అనే వ్యక్తికి గతంలో పెళ్లి జరగ్గా.. ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. మొదటి భార్య చనిపోవడంతో.. పిల్లల ఆలనా పాలనా చూసుకునేందుకు సాగర్ ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. కాగా.. లక్ష్మి మాత్రం ఆ పిల్లల్ని తరచూ చిత్రహింసలకు గురిచేసేది. ఈ క్రమంలోనే ఆదివారం (మార్చి 29న) చిన్న కుమారుడు కార్తీక్ ని(6) దారుణంగా హింసిస్తూ గోడకేసి కొట్టింది. దీంతో ఆ బాలుడి తల పగిలి చనిపోయాడు. అంతేకాదు పెద్దకుమారుడు ఆకాష్‌కి రక్తం వచ్చేలా వాతలు పెట్టింది. కార్తీక్ మరణంతో సవితి తల్లి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.