Hafeezpet Viral Video: హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్ సమీపంలో మహిళపై పోలీస్ దాడి.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ వివరణ

1 hour ago 1
హైదరాబాద్‌ హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌ వద్ద మహిళపై పోలీసు సిబ్బంది దాడికి పాల్పడినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళను కర్రతో కొట్టడంతో పాటు జుట్టుపట్టుకుని రోడ్డుపై లాక్కెళ్లిన దృశ్యాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తొలుత అతడు రైల్వే పోలీసు అని ప్రచారం జరిగినప్పటికీ, దక్షిణ మధ్య రైల్వే దీనిని ఖండించింది. వీడియోలో ఉన్న వ్యక్తి తెలంగాణ పోలీస్‌ శాఖకు చెందిన హోంగార్డు అని తెలిపింది. స్టేషన్‌లో విధులకు వచ్చిన అతడిని తిరిగి తెలంగాణ పోలీస్‌ శాఖకు పంపి.. క్రమశిక్షణ చర్యలకు సూచించినట్లు అధికారులు వెల్లడించారు.
Read Entire Article