Kazipet Old Currency: కాజీపేటలో పాత కరెన్సీ కలకలం.. రూ.1.38 కోట్ల రద్దైన నోట్లు పట్టివేత

1 hour ago 1
వరంగల్‌ జిల్లా కాజీపేటలో రద్దు చేసిన పాత రూ.500, రూ.1,000 నోట్లను అక్రమంగా చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1.38 కోట్లకు పైగా రద్దైన కరెన్సీ, రూ.6 వేల ప్రస్తుత నగదు, 10 సెల్‌ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. 2016 నవంబర్‌ 8న కేంద్రం పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు వాటిని బ్యాంకుల్లో జమ చేసేందుకు గడువు ఇచ్చింది. అనంతరం కొత్త డిజైన్‌ నోట్లను ప్రవేశపెట్టింది.
Read Entire Article