Kopparthi Kadapa Four Lane Road Rs 304 Crores: ఏపీకి సంబంధించి హైవేపై కేంద్రమంత్రి గడ్కరీ తీపికబురు చెప్పారు. కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాన్ని కడప బైపాస్‌కు అనుసంధానించేలా 4 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రూ.304.44 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 5.8 కిలోమీటర్ల పొడవున 'యాక్సెస్ కంట్రోల్డ్ హైవే'ను నిర్మించనున్నారు. ఒక ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్, రెండు భారీ వంతెనలు, నాలుగు వెహిక్యులర్ అండర్‌పాస్‌లు.. ప్రస్తుతం ఉన్న కడప బైపాస్‌ను కూడా షోల్డర్స్‌తో అభివృద్ధి చేయనున్నారు.