ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా నియమితులయ్యారు. హరీష్‌కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా హరీష్ కుమార్ గుప్తా వ్యవహరిస్తున్నారు. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌కుమార్ గుప్తా.. ఏపీ ఎన్నికల సమయంలో డీజీపీగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో ఆయనను ఈసీ.. డీజీపీగా నియమించింది. టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించారు. ఈ నెల 31న ముగియనున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ముగియనుంది. దీంతో కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించారు.