హెచ్‌సీయూ యూనివర్సిటీ వద్ద 400 ఎకరాల భూమి విషయంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదేనని తెలిపింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రైవేటు సంస్థకు కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని పేర్కొంది. అయితే.. నిరసనల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.