ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. నంద్యాలలో అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లాలో ఈ సీజన్‌లోనే గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వడదెబ్బ తగలకుండా నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ వేడిమిని తట్టుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. ఈ వేసవిలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!