హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నగరంలో మరో ఆరు చోట్ల స్కైవాక్‌లు నిర్మించాలని నిర్ణయించింది. మదీన, బీహెచ్ఈఎల్, అఫ్గల్‌గంజ్, జేఎన్‌టీయూ, మియాపూర్ టీ జంక్షన్, లక్డీకాపూల్ పెట్రోల్ బంక్ వంటి రద్దీగా ప్రాంతాల్లో వీటిని నిర్మించాలని భావిస్తోంది. ఇప్పటికే ఉప్పల్‌లో స్కైవాక్ అందుబాటులోకి రాగా.. మెహదీపట్నం, సికింద్రాబాద్‌లలో పనులు జరుగుతున్నాయి. పాదచారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. ప్రాధాన్యతా క్రమంలో వీటి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ వివరాలు..