తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 6 గంటలకుపై సాగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి.. మీడియాకు వివరించారు. ఇందులో.. ఎస్సీ వర్గీకరణకు మంత్రి వర్గం ఆమోదం తెలపగా.. దసరా కానుకగా భూభారతి చట్టాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. అంతేకాకుండా 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు వివరించారు.