కొత్త వైరస్ వ్యాప్తిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చైనా, జపాన్ దేశాలలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతానికి మన దేశంలో కొత్త వైరస్ కేసులు నమోదు కాలేదని.. ఆందోళన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. అయితే కొవిడ్ తరహాలోనే కొత్త వైరస్ లక్షణాలు ఉంటాయని ఏపీ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పద్మావతి తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి కేసులు నమోదు కాలేదని.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.