భయపడినట్టే జరిగింది. దేశంలోకి కొత్త వైరస్ ప్రవేశించింది. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిపుణులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని.. పరిస్థితిపై టాస్క్ ఫోర్స్ ద్వారా సూచనలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులలోనూ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.