హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతుల్ని చేసేలా నిరాధార, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ హెచ్చరించారు. హెచ్‌ఎంపీవీ అనేది కొత్త వైరస్ కాదని.. 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు భయపడాల్సిన పని లేదన్నారు.