ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం భానుడు తన ప్రతాపాన్ని మార్చి నెల నుంచే చూపిస్తున్నాడు. ఈ ఎండ ప్రభావం ఉదయం నుంచే ఉండటంతో ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అల్లాడిపోతున్నారు. ఎండతో పాటు.. వడగాలుల ప్రభావం కూడా ప్రజల ఉక్కిరిబిక్కిరికి కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హోలీ పండగ కారణంగా వరుస సెలవులు రానున్నాయి. ఈ మూడు రోజులు ఏం చక్కా ఇంటి వద్దే ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు.