హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ రీజినల్ రింగు రోడ్డు వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రహదారి నిర్మాణంపై కీలక అప్డేట్ వచ్చింది. రహదారి నిర్మాణానికి హెచ్‌ఎండీఏ టెండర్లు ఆహ్వానించింది. టెండరు దాఖలుకు గడువు ఈనెల 28 కాగా, వచ్చే నెల 21న టెండర్లు తెరవనున్నారు.