Miss World 2025 Compitetions: హైదరాబాద్ నగరంలో మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల ప్రారంభ వేడుకల కోసం రాష్ట్ర పర్యాటక శాఖ గచ్చిబౌలిలో స్టేడియంలో ఏర్పా్ట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఫ్లై ఓవర్ దగ్గర ఎలక్ట్రిక్ పనులు చేస్తుండగా విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.