HYD: అందుబాటులోకి మరో స్టీల్ బ్రిడ్జి.. వచ్చే నెల నుంచే రాకపోకలు.. 3.5 కి.మీ 5 నిమిషాల జర్నీ

1 hour ago 1
హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్. పాతబస్తీ పరిధిలోని చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్‌ వరకు జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టీల్ బ్రిడ్జి పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. రూ.620 కోట్ల అంచనా వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున 85 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మించారు. ఈ మార్గంలో ప్రధాన పనులైన బిటుమినస్‌ కాంక్రీట్‌ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా.. మరో నెల రోజుల్లో దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి బల్దియా వేగంగా అడుగులు వేస్తోంది. గతంలో భూసేకరణ, కరోనా లాక్‌డౌన్, నిధుల కొరత వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమైనప్పటికీ.. ప్రస్తుతం పనులు పూర్తి చేసుకోని ప్రారంభానికి సిద్ధమైంది.
Read Entire Article