హైదరాబాద్‌లో భూగర్భ జలాలు తగ్గడంతో నీటి ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగింది. మార్చిలోనే రోజువారీ ట్యాంకర్ల బుకింగ్స్ 8500 మార్కును చేరగా.. ఏప్రిల్ నాటికి ఇది 10 వేలకు చేరుతుందని జలమండలి అంచనా వేస్తోంది. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ వంటి ఐటీ ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్ల ధరలు పెరిగాయి. జలమండలి 1100 ట్యాంకర్లతో సరఫరాను ముమ్మరం చేసినప్పటికీ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా నీటి ఎద్దడి మరింత పెరిగేలా కనిపిస్తోంది.