వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆంపోలు జైలు నుంచి విడుదల అయ్యారు. సోంపేట కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటంతో శుక్రవారం ఆంపోలు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో సీదిరి అప్పలరాజు భేటీ అయ్యారు. మరోవైపు కాశీబుగ్గ హిట్ అండ్ రన్ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారనే ఆరోపణలపై సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.