యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్నప్రసాదం సామర్థ్యాన్ని రోజుకు 2 వేల మందికి పెంచాలని నిర్ణయించింది. రూ.43.12 కోట్లతో మండపం, నిత్యకల్యాణానికి రూ.9.87 కోట్లతో ప్రత్యేక భవనం, మెట్ల మార్గంలో పైకప్పు, సోలార్ వ్యవస్థ, ఆధునిక వేద పాఠశాల వంటి నిర్మాణాలకు ఆమోదం లభించింది. ఆలయ సేవలను టెక్నాలజీతో అనుసంధానించేందుకు టీసీఎస్ సహకారం తీసుకోవాలని కూడా నిర్ణయించారు.