తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో స్వచ్ఛతపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రియల్‌టైమ్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి ‘నందకం’ యాప్ తీసుకువస్తోంది. ఈ విషయాన్ని టీటీడీ ఏఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. సెప్టెంబర్ నెలలో నందకం యాప్ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఈ యాప్ గురించి ఓసారి తెలుసుకుందాం.