తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓటర్లకు వస్తున్న నకిలీ మెసేజ్‌లపై ఎన్నికల అధికారులు అప్రమత్తం చేశారు. ఓటరు కార్డు వివరాలు సరిపోలడం లేదని, ఎస్‌ఐఆర్ ఫారం తిరస్కరణకు గురైందని చెబుతూ రూ.5 చెల్లించి వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటూ సైబర్ నేరగాళ్లు లింకులు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందేశాలకు ఎన్నికల సంఘంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాంటి మెసేజ్‌లు వస్తే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.