హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ ఎగిరిగంతేసే శుభవార్త వినిపించింది. ఆస్తిపన్ను చెల్లింపుదారులకు భారీగా డిస్కౌంట్ ప్రకటిస్తూ.. ఓటీఎస్ ప్రకటించింది. ఈ పన్నుపై వడ్డీని 90 శాతం మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం 10 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుందని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు పురపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉతర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఈ సారి ఆస్తి పన్నుకు సంబంధించి రూ.2 వేల కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపారు.