Ameerpet Lover Attack: కాలేజీలో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కాలేజీ పూర్తయిన తర్వాత.. కోర్సు నేర్చుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. అయితే.. ఇక్కడికి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. దీంతో.. తన ప్రియున్ని ప్రేయసి దూరం పెట్టటం ప్రారంభించింది. అది తట్టుకోని ప్రియుడు.. గాఢంగా ప్రేమించిన ప్రేయసిపైనే బ్లేడ్‌తో దాడి చేశాడు. ఈ దాడితో తీవ్రంగా గాయపడిన యువతిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.