మీరు ఆన్‌లైన్‌లో మీ ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ప్రకటన పెట్టినట్లయితే తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని ఆర్మీ అధికారిగా లేదా ప్రభుత్వ అధికారిగా పరిచయం చేసుకుని సైబర్ కేటుగాళ్లు మోసం చేసే ఛాన్స్ ఉంది. అద్దె అడ్వాన్స్ పంపుతామని చెప్పి.. తమ చెల్లింపులు రివర్స్ మోడ్‌లో ఉంటాయని నమ్మబలికే ప్రయత్నం చేయవచ్చు. వారి మాయమాటలు నమ్మితే.. నిండా మునిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కొత్త తరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.