హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి బేగంపేట ఎయిర్‌పోర్టు రన్‌వే కింద అండర్‌పాస్ టన్నెల్ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి దీనికి సంబంధించి రెండు వారాల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. రూ. 550 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ 600 మీటర్ల టన్నెల్.. ప్యారడైజ్-సుచిత్ర జంక్షన్ ఎలివేటెడ్ కారిడార్‌లో భాగంగా ఉంటుంది. ఇది అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ వైపు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.