జాతీయ రహదారి 44 (NH-44) పై ప్యారడైజ్ జంక్షన్ – డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు మొదలవుతున్నందున.. ఈ నెల 30.10.2025 నుంచి తొమ్మిది నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలవుతాయి. ఈ సమయంలో రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుంచి బాలంరాయి మధ్య రోడ్డు మూసివేయనున్నారు. బాలానగర్ వైపు నుంచి వచ్చేవారు తాడ్‌బండ్ → డైమండ్ పాయింట్ → ముడ్‌ఫోర్ట్ మీదుగా వెళ్లాలి. ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని.. సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.