ఇంటి బీరువాలోని బంగారు నగలు కనిపిచటం లేదని డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన పోలీసులు ఘటన జరిగిన ఇంటి వద్దకు చేరారు. ఇంటి పరిసరాలను జల్లెడ పట్టగా.. మాయమైన బంగారు నగలు వరండాలోని చెత్తబుట్టలో దర్శనమిచ్చాయి. ఈ ఘటన మలక్‌పేట పీఎస్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో చోటు చేసుకుంది.