హైదరాబాద్ నగర వాహనదారులకు తీపి కబురు. నగరంలో మరో కొత్త అండర్‌పాస్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ ప్రాంతంలో కొత్త అండర్‌పాస్ నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తుండగా.. అందులో భాగంగా బేగంపేట వద్ద కొత్తగా అండర్‌పాస్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు.