హైదరాబాద్‌లోని టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి జానారెడ్డి నివాసాలకు అధికారులు మార్కింగ్ వేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా.. అందుకు కొంత మేర భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో రోడ్డు వెడల్పు చేయడానికి పలువురి ప్రముఖుల ఇళ్లకు అధికారులు మార్కింగ్ వేశారు.