హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన ఓ కస్టమర్‌కు ఊహించని షాక్ తగిలింది. బిర్యానీ సగం తిన్న తర్వాత... అందులో కనిపించింది చూసి ఖంగుతున్నాడు. అందులో సగం తాగిన సిగరెట్ పీక కనిపించటంతో హోటల్ నిర్వాహకులను నిలదీశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.