హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చీకటి వ్యాపారం చేస్తున్న కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య, భర్త, ఇద్దరు కుమారులు ఇలా అందరూ కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. భర్త గంజాయిని తీసుకొస్తుండగా.. భార్య వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కుమారులు వాటిని నగర శివారుల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.