హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో మహేష్ అనే క్యాబ్ డ్రైవర్ భార్య శ్రీదేవి, అత్త మంగపై కత్తితో దాడి చేశాడు. భార్యతో గొడవపడిన మహేష్, ఆమె తల్లి సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తుండగా ఇద్దరినీ గాయపరిచాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, శ్రీదేవి ఆరోగ్యం నిలకడగా ఉంది, మంగ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.