రిఫ్రిజిరేటర్ డోర్ తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఫ్రిజ్‌కు ఎర్తింగ్ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్ వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు. లేదంటే ప్రమాదాల బారిన పడే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.