HYD మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ముగ్గురు ఉజ్బెకిస్థాన్‌ మహిళలు

2 hours ago 2
హైదరాబాద్‌ మాదాపూర్‌లోని చంద్రనాయక్‌ తండాలో ఉన్న ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌పై మాదాపూర్‌, కూకట్‌పల్లి ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సర్వీస్ అపార్ట్‌మెంట్ గదిలో ఉన్న ముగ్గురు ఉజ్బెకిస్థాన్‌ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారు పాస్‌పోర్టు, వీసా లేకుండా నేపాల్‌ మీదుగా భారత్‌లోకి ప్రవేశించి వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీకి చెందిన నాయక్‌ ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా గుర్తించగా.. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కస్టమర్ల గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని పోలీసులు సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులను హెచ్చరించారు.
Read Entire Article