హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే నగరంలో కొత్తగా ఫ్లైఓవర్లు, స్కైవాక్‌లు, అండర్‌పాసులు నిర్మిస్తున్నారు. ముంబై హైవేలో మెహిదీపట్నం పట్నం వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. పాదచారులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ స్కైవాక్ నిర్మాణానికి సిద్ధం కాగా.. డిజైన్ విషయంలో హెచ్‌ఎండీఏ కీలక నిర్ణయం తీసుకుంది.