ఆ యువకుడు కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. చేసిన అప్పు చెల్లించలేక ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలపై పడుకున్నాడు. ఇదే విషయాన్ని చెల్లికి ఫోన్ చేసి చెప్పాలనుకున్నాడు. రాత్రి సమయంలో పట్టాలపై పడుకొని ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అయితే దూరంగా పట్టాలపై సెల్‌ఫోన్ వెలుతురు రైల్వే పోలీసుల కంటపడింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు యువకుడ్ని రక్షించారు. ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటు చేసుకుంది.