హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం (నవంబర్ 26) పోలీసులు ఆపరేషన్ రోప్ కార్యక్రమం చేపట్టారు. ఫుట్‌పాత్ ఆక్రమించిన దుకాణాలు.. తోపుడు బండ్లను తొలగించారు. అనంతరం సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.