హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్. ట్రాఫిక్ చలాన్ల విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వాట్సాప్ లేదా మెసేజ్ రూపంలో చలానా పంపించి, యూపీఐ విధానంలో చలాన్లు చెల్లించే విధానాన్ని తీసుకురానున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రస్తుతం కొన్ని నగరాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.