హైదరాబాద్ మలక్‌పేట జమునా టవర్స్‌లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గుండెపోటుతో ఆమె మృతి చెందిందని భర్త చెబుతుండగా.. మృతురాలి ఒంటిపై బంధువులు గాయాలు గుర్తించారు. భర్తే కొట్టి చంపేసి గుండెపోటుగా చిత్రీకరిస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.