హైదరాబాద్ షేక్‌పేటలోని ఒక ప్రైవేట్ వెటర్నరీ హాస్పిటల్‌లో దారుణమైన 'బ్లడ్ బిజినెస్' వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీధి కుక్కలను సంరక్షణ పేరుతో తీసుకొచ్చి.. వాటిని బోన్లలో బంధించి రక్తాన్ని సేకరిస్తూ ప్యాకెట్ రూ. 25 వేల వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జంతు సంక్షేమ బోర్డు, జీహెచ్‌ఎంసీ అధికారులు విచారణ చేపట్టారు. సరైన రక్తనిధి కేంద్రాలు లేకపోవటాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మూగజీవాలను హింసిస్తున్న ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.