సాఫ్ట్ వేర్ ఉద్యోగం వెలగబెట్టేందుకు కేరళ నుంచి హైదరాబాద్ వచ్చారు. కొన్ని రోజుల పాటు బాగానే ఉద్యోగం చేశారు. హాస్టల్‌లో ఫ్రెండ్స్‌తో సావాస దోశమో.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులం కాబట్టి చెడు అలవాట్లు ఉండాలని ఫిక్సయ్యారో కానీ.. మొత్తానికి డ్రగ్స్‌కి అలవాటు పడ్డారు. ఆ అలవాటు కాస్త వ్యసనంగా మారటంతో.. డబ్బు కోసం మళ్లీ అదే డ్రగ్స్ దందా మొదలుపెట్టి.. జల్సాలు చేయటం మొదలుపెట్టారు. ఎంత తెలివిగా చేసిన తప్పు ఎప్పటికైనా బయటపడకమానదు కాబట్టి.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయి కటకటాలపాలయ్యారు.