జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్డులో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. నవంబర్ 3 నుంచి పనులు పూర్తయ్యే వరకు సాయికాంత, మయూరి బార్, సుభాష్ నగర్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాలను సూచించిన పోలీసులు.. భారీ వాహనాల రాకపోకలను కొన్ని ప్రాంతాల్లో నిషేధించారు.