హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లలో ఇష్టంగా చికెన్ తింటున్నారా..? అయితే మీరు తినేది కుళ్లిపోయిన చికెన్ అయ్యుండే ప్రమాదం ఉంది. నగరంలో ముఠాగా ఏర్పడుతున్న కొందరు కుళ్లిన కోడి వ్యర్థాలను సేకరించి హోటల్స్, రెస్టారెంట్లకు సప్లయ్ చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. చచ్చిన కోళ్లను కూడా చికెన్ ముక్కులుగా కట్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు.